Addam News
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 12:38 pm Posted by : Addam News

ఘ‌నంగా మాజీ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు బ‌ర్త్ డే వేడుక‌లు

ఘ‌నంగా మాజీ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు బ‌ర్త్ డే వేడుక‌లు

హైదరాబాద్, జ‌న‌వ‌రి 10, అద్దం న్యూస్ :   మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత‌రావు 60 వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్ సమీపంలో ఘనంగా వేడుకలు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా మైనంపల్లి ట్రస్ట్ చైర్మన్ బద్దం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చుతూ కేక్ కట్ చేసి, వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గాంధీ హాస్పిటల్‌కు చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి బంధువులు, పేదలందరికీ చికెన్ బిర్యానీ పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసు శ్రీనివాసరావు, వెంకటేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బద్దం మోహన్ రెడ్డి మాట్లాడుతూ… మైనంపల్లి హనుమంతరావు ఇలాంటి సేవాభావంతో కూడిన పుట్టిన రోజులను మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఆయ‌న‌ ఆయురారోగ్యాలతో, ప్రజల కోసం మరింత సేవ చేస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు జగదీష్, బాలు యాదవ్, అనిల్ యాదవ్ సురేష్ యాదవ్, వినయ్, ఎమ్మెల్సీ బుగ్గారపు ద‌యానంద్ తనయుడు వరుణ్ బుకారపు, శివ, వినోద్ యాదవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png