Addam News
Newspaper Banner
Date of Publish : 23 May 2025, 7:42 pm Posted by : Addam News

హనుమాన్ జన్మోత్సవంలో పాల్గొన్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్

హైదరాబాద్, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్ నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన హనుమాన్ జన్మోత్సవంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ ఎం.అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ జానకి సుధాకర్ ఆధ్వర్యంలో అంజన్ కుమార్ యాదవ్ కు ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, రెనోవేషన్ కమిటీ కమిటీ సభ్యులు శ్యామ్ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విడి.కృష్ణ‌, శీలం స‌త్య‌నారాయ‌ణ‌, సురేష్‌, పాశం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png