గ‌ణ‌నాథుడికి పూజ‌లు చేసిన మాజీ కేంద్ర మంత్రి స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 24, ( అద్దం న్యూస్ ) :     గ‌ణ‌నాథుడికి ఆశీర్వాదం, ఆశిస్సులు ప్ర‌జ‌లంద‌రి పై ఉండాల‌ని, ప్ర‌జ‌లంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని మాజీ కేంద్ర మంత్రి స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ డివిజ‌న్ దోమ‌ల‌గూడ జెబి అపార్ట్‌మెంట్ చౌర‌స్తా వ‌ద్ద‌ నవరాత్రి శక్తి వ్యాయామశాల యూత్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన గ‌ణేష్ మండ‌పంలో విఘ్నేశ్వ‌రుడికి ఘ‌నంగా పూజ‌లు జ‌రిగాయి. గురువారం స‌ర్వే సాయి తేజ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన పూజ‌ల‌కు కేంద్ర మాజీ మంత్రి స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ...