Addam News
Newspaper Banner
Date of Publish : 20 May 2025, 12:13 am Posted by : Addam News

త్వ‌ర‌లో కోటి 29 ల‌క్ష‌ల నిధుల‌తో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ – గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్

మాట్లాడుతున్న గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్
                                      మాట్లాడుతున్న గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్

హైద‌రాబాద్‌, మే 19, అద్దం న్యూస్ :    త్వరలో కోటి ఇరవై తొమ్మిది లక్షల వ్యయంతో గాంధీనగర్ డివిజన్‌లో మంచినీటి, సివ‌రేజి పైప్‌లైన్ల పనులకు శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు స్థానిక డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ తెలిపారు. సోమ‌వారం గాంధీన‌గ‌ర్‌లోని త‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ.. త్వరలో గాంధీనగర్ డివిజన్‌లోని గోల్కొండ చౌరస్తా నుండి ఆర్‌టిసి క్రాస్ రోడ్స్ వరకు, టిఆర్‌టి బ‌స్తీ ద‌వాఖానా, ఆంధ్రకెఫ్ సమీపంలోని నిమ్కర్ బిల్డింగ్, వివి గిరి నగర్ బస్తి,

అరుంధతినగర్ బస్తి త‌దిత‌ర ప్రాంతాల్లో రూ. కోటి 29 లక్షల, బోర్డు నిధులతో నూతన మంచినీటి, సివ‌రేజి పైప్‌లైన్ నిర్మాణం పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. గత కొంత కాలంగా డివిజన్‌లోని ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సరఫరా సమస్యను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సహకారంతో జలమండలి ఎండి పై వత్తిడి తెచ్చి నిధులను మంజూరు చేయించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొన్నారు.

 

 

 

 

 

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png