గాంధీన‌గ‌ర్‌లో సిసి రోడ్డు ప‌నుల‌కు శంకుస్థాప‌న – పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ :     ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ నేతాజిన‌గ‌ర్ బ‌స్తీలో రూ. 14 ల‌క్ష‌ల నిధుల‌తో, ఆంధ్రా కేఫ్ చౌర‌స్తా ద‌గ్గ‌ర్ ఎస్ఆర్‌టిలో రూ.4 ల‌క్ష‌ల నిధుల‌తో సిసి రోడ్డు ప‌నుల‌కు శ‌నివారం శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు సిసి రోడ్డు ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్...