గాంధీన‌గ‌ర్‌లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

గాంధీన‌గ‌ర్‌లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 7, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో రూ.30 ల‌క్ష‌ల నిధులతో జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్ 2వ అంత‌స్తు నిర్మాణ ప‌నుల‌కు, రూ.14 ల‌క్ష‌ల నిధుల‌తో సంజీవ‌య్య‌న‌గ‌ర్ బ‌స్తీ క‌మ్యూనిటీహాల్ బ్యాలెన్స్ ప‌నులు, రూ.26 ల‌క్ష‌ల నిధుల‌తో జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ కమ్యూనిటీహాల్ మ‌ర‌మ్మ‌తు నిర్మాణ ప‌నుల‌కు శ‌నివారం శంకుస్థాప‌న‌లు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మాల‌కు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి జి.కిష‌న్‌రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్...