Addam News
Newspaper Banner
Date of Publish : 23 May 2025, 1:17 am Posted by : Addam News

నేడు గాంధీన‌గ‌ర్‌లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు

నేడు గాంధీన‌గ‌ర్‌లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు

హైద‌రాబాద్‌, మే 22, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని ప‌లు ప్రాంతాల్లో నేడు ( శుక్ర‌వారం ) ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు జ‌రుగ‌నున్నాయి. సుమారు కోటి 29 ల‌క్ష‌ల నిధుల‌తో డివిజ‌న్‌లోని గోల్కొండ చౌర‌స్తా నుంచి ఆర్టీసి క్రాస్ రోడ్ వ‌ర‌కు, అరుంధ‌తిన‌గ‌ర్ బ‌స్తీలో, నిమ్కార్ గ‌ల్లీలో, టిఆర్‌టి బ‌స్తీ ద‌వాఖానా వెన‌క వీధిలో, వివి గిరి న‌గ‌ర్ బ‌స్తీల్లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు జ‌రుగ‌నున్నాయ‌ని స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ తెలిపారు. ఈ అభివృద్ధి ప‌నుల శంకుస్థాప‌న‌ల‌కు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి జి.కిష‌న్‌రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ లు హాజ‌ర‌వుతార‌ని తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png