వినాయక నిమజ్జనానికి విచ్చేసిన ప్రజలకు ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి పంపిణీ
హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 25, ( అద్దం న్యూస్ ) : వినాయక నిమజ్జన కార్యక్రమానికి నారాయణగూడకు విచ్చేస్తున్న ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నారాయణగూడలో ఉచిత మంచినీటి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి మాట్లాడుతూ... నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు, ప్రజలకు ఉచితంగా మంచినీటిని అందించారు. ప్రజలకు సేవ చేయడం, సామాజిక బాధ్యతను నిర్వర్తించడం తమ కర్తవ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ప్రతినిధులు...