Addam News
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 8:10 am Posted by : Addam News

ఆర్య నగర్‌లో ఉచిత వైద్య శిబిరం

ఆర్య నగర్‌లో ఉచిత వైద్య శిబిరం

లాలాపేట్, సెప్టెంబ‌ర్ 8, ( అద్దం న్యూస్ ) : లాలాపేట్ ఆర్య నగర్ కమ్యూనిటీహాల్‌లో మంగళవారం అప్సా, జనహిత సేవా ట్రస్ట్, కిమ్స్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జ‌రిగింది. కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు 150 మందికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షించి, ఆరోగ్య సలహాలను, మందులు అందజేశారు. ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఎం.శ్రీనివాస్ ఒంటినొప్పులు ఉన్నవారికి ఎక్సర్ సైజ్ లను చూపించారు. ఈ శిబిరంలో జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నర్సింహ మూర్తి, అప్సా సంస్థ అప్సా సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ ఎం.బస్వరాజ్, ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ బి.రమేష్, జి.మంజుల, సిబ్బంది, ఆర్యనగర్ పంచ్ కమిటీ అధ్యక్షుడు నాచారం స్వామి, ఆర్య సమాజ్ కోశాధికారి నాగరాజు, జనహిత క్యాంపు కో–ఆర్డినేటర్ బి.నర్సింగ్ రావు, కిమ్స్ ఫౌండేషన్ కో–ఆర్డినేటర్ జే.విక్రమ్ పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png