ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా న‌వీన్ నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరం

బాగ్‌లింగంపల్లి, న‌వంబ‌ర్ 19, ( అద్దం న్యూస్ ) : ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని రాజ్యసభ సభ్యుడు మందాడి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వి.నవీన్ నాయ‌క్‌ నాయకత్వంలో డివిజన్ కార్యాలయం వద్ద గురువారం ఉచిత వైద్య, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో జనరల్ ఫిజిషియన్ వైద్య పరీక్షలతో పాటు రక్త పరీక్షలు, ఊపిరితిత్తులకు సంబంధించిన పరీక్షలు, దంత పరీక్షలు...