విద్యార్థుల ఉద్యమానికి, ఓటు హక్కుల పరిరక్షణ పోరాటానికి సంపూర్ణ మద్దతు – తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు డాక్టర్.జితేందర్ రావు తనుగుల
హైదరాబాద్, అక్టోబర్ 12, ( అద్దం న్యూస్ ) : దేశంలో రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల బలోపేతం, సామాజిక న్యాయం కోసం విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు చేస్తున్న పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( TYJF ) అధ్యక్షుడు డాక్టర్.జితేందర్ రావు తనుగుల విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు తమ హక్కులు, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం కోసం నిర్వహిస్తున్న ఉద్యమాలకు ప్రజలు...