టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జి.నాగ‌భూష‌ణం నియామ‌కం

హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ :   తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు జి.నాగ‌భూష‌ణం నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్ర‌క‌టించింది. జి.నాగ‌భూష‌ణం గతంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కార్మిక శాఖ స‌ల‌హామండ‌లి బోర్డు వైస్ ఛైర్మ‌న్‌గా, కాంగ్రెస్ పార్టీ గ్రేట‌ర్ హైద‌రాబాద్ కో-ఆర్డినేట‌ర్‌గా, 2024 ఎంపి ఎన్నిక‌ల్లో భాగంగా అంబ‌ర్‌పేట్ నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల ప‌రిశీలికులుగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ను టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా అధిష్టానం నియ‌మించింది. ఈ సంద‌ర్భంగా నాగ‌భూష‌ణం...