Addam News
Newspaper Banner
Date of Publish : 27 September 2023, 5:54 pm Posted by : sairam

బండి ని కలిసిన గడ్డం నాగరాజు

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిసి తనకు అసెంబ్లీ టికెట్ కేటాయించడంలో సహకరించాలని బిజెపి మానకొండూరు నియోజకవర్గం ఇన్చార్జ్ గడ్డం నాగరాజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా పార్టీ కోసం నిరంతరం పాటుపడుతున్నానన్నారు. మానకొండూర్ నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాల కోసం బియ్యం, పుస్తె మట్టెలు, ఆర్థిక సాయం, క్రికెట్ టోర్నమెంట్స్ దేవాలయాలకు ఆర్థిక సాయం క్రికెట్ కిట్స్, వాలీబాల్ కిట్స్ అందజేస్తూ నియోజకవర్గంలో ప్రజా సేవలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశానని తెలిపారు.

మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గo నుంచి బిజెపి అభ్యర్థిగా జాతీయ నాయకత్వం నా అభ్యర్థిత్వం ఖరారు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అజయ్ వర్మ, ఏన్నం ప్రకాష్ మండల ప్రధాన కార్యదర్శి సోన్నాకుల శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షులు బాషబోయిన ప్రదీప్ యాదవ్, అభి ,అనిల్ కార్యకర్తలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png