బండి ని కలిసిన గడ్డం నాగరాజు
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిసి తనకు అసెంబ్లీ టికెట్ కేటాయించడంలో సహకరించాలని బిజెపి మానకొండూరు నియోజకవర్గం ఇన్చార్జ్ గడ్డం నాగరాజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా పార్టీ కోసం నిరంతరం పాటుపడుతున్నానన్నారు. మానకొండూర్ నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాల కోసం బియ్యం, పుస్తె మట్టెలు, ఆర్థిక సాయం, క్రికెట్ టోర్నమెంట్స్ దేవాలయాలకు ఆర్థిక సాయం క్రికెట్ కిట్స్, వాలీబాల్ కిట్స్ అందజేస్తూ నియోజకవర్గంలో ప్రజా సేవలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశానని తెలిపారు. మానకొండూరు...