హైదరాబాద్, నవంబర్ 8, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ హరినగర్‌లో పవర్ బోర్ పని చేయకపోవడంతో బిజెవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడ్డం నవీన్ ఇటీవల వాటర్ వర్క్స్ నారాయణగూడ జిఎం శ్రీధర్‌ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. త్వరలోనే పవర్ బోర్ రిపేర్ చేయిస్తామని జీఎం ఇచ్చి హామీ మేరకు శనివారం పవర్ బోర్ రిపేర్ పనులను చేయించారు. ఈ పనులను బిజెవైఎం ముషీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గడ్డం నవీన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గడ్డం నవీన్ మాట్లాడుతూ… పవర్ బోర్ పని చేయకపోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులుపడ్డారన్నారు. విషయాన్ని జీఎం శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లానని, ఆయన స్పందించి పవర్ బోర్ మరమ్మతులు చేయించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఈ పనుల పర్యవేక్షణలో బస్తీ పెద్దలు గడ్డం బాలకృష్ణ, నందు, ఇల్లందులు రాకేష్, నేరెళ్ల రాకేష్, నిఖిల్ తదితరులున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png