Addam News
Newspaper Banner
Date of Publish : 30 May 2025, 9:25 pm Posted by : Addam News

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధికి నిరంతరం పాటు పడిన వ్యక్తి గడ్డం శ్రీనివాస్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు

హైద‌రాబాద్‌, మే 30, అద్దం న్యూస్ :   తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధికి కార్మికుల సంక్షేమానికి నిరంతరం పాటు పడిన వ్యక్తి గడ్డం శ్రీనివాస్ అని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకుడు తెలిపారు. శుక్రవారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి విఎస్‌టి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ పదవీ విరమణ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ అంబేద్కర్ వాధి జెబి.రాజు, ఆపరేషన్ ఈడి మునిశేఖర్, మెకానికల్ ఇంజనీరింగ్ సెక్షన్ మేనేజర్ వెంకన్న, ఇంజనీరింగ్ సెక్షన్ అధికారి ఉషాదేవి, రిటైర్డ్ కృష్ణ కాంత్, జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, చైర్మన్ రాజయ్య నాయక్ తదితరులు హాజరై గడ్డం శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… గత 33 సంవత్సరాలుగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగిగా తన విధులు నిర్వహిస్తూ సమాజంలో ఆర్థిక సామాజికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ బలహీనవర్గాల ఉద్యోగుల సమస్యల సాధనకై నిరంతరం కృషి చేశారని కొనియాడారు. వారి సమస్యల సాధనకై ఉద్యమాలు చేస్తూనే అంచలంచెలుగా రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా ఎదిగి బలహీన వర్గాల ఆపద్బాంధవుడిగా నిలిచాడని అన్నారు. ఆయన సేవలు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటారని రిటైర్డ్ అయినా కానీ గడ్డం శ్రీనివాస్ తమ అమూల్యమైన అనుభవాలను ఎప్పటికప్పుడు కార్మికులకు అధికారులతో పంచుకోవాలని కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png