Addam News
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 9:30 am Posted by : Addam News

తెలంగాణ రాష్ట్ర‌ బిసి జేఏసి క‌న్వీన‌ర్‌గా గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా నియామ‌కం

తెలంగాణ రాష్ట్ర‌ బిసి జేఏసి క‌న్వీన‌ర్‌గా గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా నియామ‌కం

హైదరాబాద్, డిసెంబ‌ర్ 1, అద్దం న్యూస్ :    ఆరె క‌టిక అభివృద్ధి సంఘం వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, ఆరె క‌టిక‌ల భ‌విష్య‌త్ కోసం అనునిత్యం కృషి చేస్తున్న ఉద్య‌మ‌కారుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా తెలంగాణ రాష్ట్ర‌ బిసి జేఏసి క‌న్వీన‌ర్‌గా నియమితుల‌య్యారు. ఈ మేర‌కు బిసి జేఏసి ఛైర్మ‌న్ ఆర్‌.క్రిష్ణ‌య్య సోమ‌వారం అశోక్ దాదా కు నియామ‌కం ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర‌ బిసి జేఏసి క‌న్వీన‌ర్‌గా నియ‌మితులైన‌ గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా మాట్లాడుతూ… ఆరె క‌టిక అభివృద్ధి సంఘం ఆధ్వ‌ర్యంలో అనేక పోరాటాలు చేశాన‌ని, బిసి జేఏసి చేప‌ట్టే ఉద్య‌మాల‌కు పూర్తిస్థాయిలో ప‌ని చేస్తామ‌న్నారు. త‌న‌ను బిసి జేఏసి రాష్ట్ర క‌న్వీన‌ర్‌గా నియ‌మించిన ఛైర్మ‌న్ ఆర్‌.క్రిష్ణ‌య్య‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆరె కటిక అభివృద్ధి సంఘం లీగల్ అడ్వైజర్ కె.సాయి దాదా, జాయింట్ సెక్రెటరీ జె.శ్రీనివాస్ దాదా, చింటూ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png