ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్‌లో గాంధీ జయంతి – గాంధీ వేషధారణలో ఆకట్టుకున్న విద్యార్థులు
కవాడగూడ, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ లో మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు గాంధీజి వేషధారణలో విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్థన్ రెడ్డి హాజరై గాంధీ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మనం కేవలం గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేయడంతో సరిపెట్టకూడదు... ఆయన నడిచిన నడకను, ఆయన ఆలోచనలను మన దైనందిన...