Addam News
Newspaper Banner
Date of Publish : 16 July 2025, 10:45 pm Posted by : Addam News

అమ్మ వారి విగ్రహానికి వెండి తొడుగు సమర్పించిన గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

అమ్మ వారి విగ్రహానికి వెండి తొడుగు సమర్పించిన

గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్



హైదరాబాద్, జులై 16, అద్దం న్యూస్ :    అమ్మ‌వార్ల దేవాల‌యాల అభివృద్ధి కోసం త‌న వంతు స‌హాయ స‌హ‌కారాలు అంద‌చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నామ‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అరుంధ‌తిన‌గ‌ర్ బ‌స్తీలో శ్రీ క‌ట్ట మైస‌మ్మ తల్లి ఆల‌యంలో అమ్మ‌వారి విగ్ర‌హ పునఃప్ర‌తిష్టాప‌న ఇటీవ‌ల జ‌రిగింది. ఈ నేప‌ధ్యంలో బుధ‌వారం అరుంధ‌తిన‌గ‌ర్ బ‌స్తీ క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలోని అమ్మ‌వారి విగ్ర‌హానికి కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని, బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ విన‌య్ కుమార్ దంప‌తులు త‌న సొంతంగా 710 గ్రాముల వెండితో చేయించిన చ‌తుర్భుజాలు ( నాలుగు చేతులకు ) వెండి తొడుగును స‌మ‌ర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావ‌ని మాట్లాడుతూ… దేవాలయాలను కాపాడుకోవడం మన హిందు ధర్మం, వాటిని అభివృద్ధి పరుచుకొని సంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో పూజించుకొని, దేవతల దీవెనలు పొందడం అనేదే సనాతన ధర్మ పరిపాలన అన్నారు. ఇలాంటి ఆధ్మాత్మికను ప్ర‌తి ఒక్క‌రూ అల‌వ‌ర్చుకోవాల‌న్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, శివ కుమార్, సురేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, బ‌స్తీ, గుడి క‌మిటీ స‌భ్యులు ఉమేష్ , బెల్ బాటమ్ రాజు, సిహెచ్ రాజు, పి.యదగిరి, ప్రకాష్, శ్రీనివాస్ గౌడ్, మెరుగు శ్రీనివాస్ యాదవ్, సరస్వతి, రాములమ్మ, నీలమ్మ, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png