Addam News
Newspaper Banner
Date of Publish : 27 June 2025, 2:08 am Posted by : Addam News

అరుంధతినగర్ బ‌స్తీలో సిసి రోడ్డు పనులను పర్యవేక్షించిన గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 26, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అరుంధ‌తీన‌గ‌ర్ బ‌స్తీలో ఇటీవ‌ల శంకుస్థాప‌న జ‌రిగిన సిసి రోడ్డు ప‌నుల‌ను స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ ప‌ర్య‌వేక్షించారు. గురువారం అధికారులు, బిజెపి నాయ‌కులు, బ‌స్తీవాసుల‌తో క‌లిసి ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించిన కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా ప్రతి వర్షా         కాలంలో వరద ముంపున‌కు గురవుతున్న అరుంధతినగర్ బ‌స్తీవాసుల ఫిర్యాదు మేరకు వారికి శాశ్వత పరిష్కారం అందించడంలో భాగంగా నూతన రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించారని తెలిపారు. వెంటనే బస్తీలో నూతన సీవరేజీ, మంచినీటి పైప్‌లైన్ పనులు కూడా ప్రారంభం అవుతాయ‌న్నారు. బ‌స్తీవాసులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా బోనాల పండుగలోపు త్వరగతినా పనులు పూర్తి చేయాలని జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ స‌లామ్‌, వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ మ‌హేష్, కాంట్రాక్ట‌ర్‌ల‌కు ఆదేశాలిచ్చామ‌న్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఏ.వినయ్ కుమార్, బీజేపీ డివిజన్ అద్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.నవీన్ కుమార్, ఆనంద్ రావు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, ఎం.ఉమేష్, సాయి కుమార్, ధనరాజ్, శ్రీనివాస్ గౌడ్, బ‌స్తీవాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png