చిన్నారుల‌తో అక్ష‌రాభ్యాసం చేయించిన గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 14, అద్దం న్యూస్ :   వేసవి సెలవుల అనంతరం మొదలైన అంగన్‌వాడి కేంద్రాల్లో కొత్తగా చేరిన పిల్లలకు జవహర్‌న‌గ‌ర్ కమ్యూనిటీహాల్‌లో ఉన్న అంగన్‌వాడి కేంద్రంలో శనివారం అమ్మఒడి.. అంగన్‌వాడి కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పిల్లలకు అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావ‌ని మాట్లాడుతూ... అంగన్‌వాడిల్లో చిన్న పిల్లలకు మొదటి విద్యాభ్యాసం మొదలవుతుందని, పిల్లలకు విద్యతో పాటు ఆటలు, పాటలు, రైమ్స్ నేర్పడమే కాకుండా ప్రతిరోజూ పౌష్టికాహారం అందిస్తారని అన్నారు. ప్రైవేటు...