Addam News
Newspaper Banner
Date of Publish : 14 May 2025, 10:56 pm Posted by : Addam News

గాంధీనగర్ డివిజన్ అండర్ – 14 క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కర‌ణ‌

 

 

గాంధీనగర్ డివిజన్ అండర్ – 14 క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కర‌ణ‌

 

హైదరాబాద్, మే 14, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో ఈ నెల 16, 17 తేదీల్లో అండర్ – 14 క్రికెట్ టోర్నమెంట్ –2025 ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ టోర్న‌మెంట్‌కు సంబంధించిన పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం బుధ‌వారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ ఎ.విన‌య్ కుమార్ హాజ‌రై పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా విన‌య్ కుమార్ మాట్లాడుతూ… గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నీవీ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను వేసవి సెలవుల్లో ఉన్న‌ పిల్లలకు క్రీడల్లో ఆసక్తిని కలిగించేందుకు ఈ క్రికెట్ టోర్న‌మెంట్‌ను నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. టోర్న‌మెంట్‌లో గెలిచిన టీంలకు ప్రముఖుల చేతుల మీదుగా నగదు బహుమతి, ట్రోఫీలతో పాటు సర్టిఫికెట్లను అందచేయనున్నామని తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో గాంధీన‌గ‌ర్ శ్రీనివాసా గ్రౌండ్స్‌లో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. ఆసక్తి గల పిల్లలు తమ ఆధార్ కార్డు జీరాక్స్‌తో నిర్వాహకులను సంప్రదించాలని కోరారు. 91773 02777, 77996 57887, 78423 17073, 86867 10391 ఫోన్ నంబ‌ర్ల‌కు కాల్ చేసి సంప్ర‌దించాల‌న్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, బీజేపీ నాయ‌కులు శ్రీకాంత్, దామోదర్, పి.నర్సింగ్ రావు, సత్తి రెడ్డి, శివ కుమార్, సాయి కుమార్, ఆనంద్ రావు, సత్యేందర్, రాహుల్, సాయి తేజ, నీరజ్, కృష్ణవేణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png