గోకుల్‌న‌గ‌ర్‌లో రూ.75 వేలకు గణేష్ లడ్డూ వేలం

తార్నాక, సెప్టెంబర్ 26, ( అద్దం న్యూస్ ) :     తార్నాక‌ గోకుల్‌న‌గ‌ర్‌లోని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణేష్ లడ్డూ వేలం పాటను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేలం పాటలో స్థానికుడు వెంకటేష్ మడివార్ పోటీపడి రూ.75 వేలకు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. గణనాథుని దివ్య ప్రసాదమైన లడ్డూను దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వెంకటేష్ మడివార్ తెలిపారు. వేలం సందర్భంగా మండపం వద్ద భక్తులతో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో...