అరుంధతినగర్ బస్తీలో  చెత్త కుప్ప తొల‌గింపు

హైదరాబాద్, న‌వంబ‌ర్ 12, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అరుంధతిన‌గ‌ర్ బ‌స్తీలో గ‌త ప‌క్షం రోజులుగా పేరుకుపోయిన చెత్తకుప్పను స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ ఆదేశాల మేర‌కు జిహెచ్ఎంసి సిబ్బంది తొల‌గించారు. బ‌స్తీలో చెత్త‌ పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన ఏర్పడ‌డం వ‌ల్ల ఇబ్బందిగా ఉంద‌ని బ‌స్తీవాసులు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కు ఫిర్యాదు చేయ‌డంతో స్పందించిన‌ కార్పొరేటర్ చెత్త‌ను తొల‌గించాల‌ని జిహెచ్ఎంసి సిబ్బందిని ఆదేశించారు. బుధ‌వారం బ‌స్తీలో చెత్త‌ను జిహెచ్ఎంసి సిబ్బంది తొల‌గించారు. బస్తీలో...