Addam News
Newspaper Banner
Date of Publish : 18 June 2025, 6:33 am Posted by : Addam News

ఎన్‌టిఆర్ స్టేడియం చుట్టు చెత్తాచెదారం – ప‌ట్టించుకోని అధికారులు

ఎన్‌టిఆర్ స్టేడియం చుట్టు చెత్తాచెదారం

ప‌ట్టించుకోని అధికారులు

హైదరాబాద్, జూన్ 17, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ డివిజ‌న్ ఎన్‌టిఆర్ స్టేడియం, భీమా మైదానం ప‌రిస‌రాల్లో చెత్తాచెదారంతో నిండిపోయింది. దానికితోడు భీమా మైదానంలో నివ‌సించే పారిశుద్ధ్య కార్మికుల‌కు చెందిన చెత్త సేక‌ర‌ణ వాహ‌నాలు, చెత్త‌, దుర్వాస‌న‌తో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గుర‌వుతున్నారు. భీమా మైదానంలో నివ‌సించే పారిశుద్ధ్య కార్మికుల‌కు చెందిన చెత్త సేక‌ర‌ణ వాహ‌నాల‌ను ఎన్‌టిఆర్ స్టేడియంలో పెట్ట‌డం వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఆటోలను బ‌స్తీ ఎదురుగా, స్కూల్ ఎదురుగా పెట్టడంతో చుట్టూ పక్కల ఉన్న వారికి చాలా ఇబ్బంది కారంగా మారింది. చెడు వాసనతో, వాటి వల్ల వచ్చే దోమలతో స్కూల్ లో ఉన్న పిల్లలకు నరకంలా మారింది. ఈ విష‌యాన్ని జిహెచ్ఎంసి అధికారుల‌కు, ట్రాఫిక్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా వారు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని స్థానికులు వాపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులకు చెప్తే ఇంత వరకు ఏ యాక్షన్ తీసుకోలేదని, స్థానిక ఎమ్మెల్యే కి పిర్యాదు చేసిన ఏం ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో వైపు ట్రాఫిక్ కూడా నిలిచిపోవడం వల్ల చుట్టు పక్కల వాళ్లు ఇబ్బందులుప‌డుతున్నారు. చెత్త సేక‌ర‌ణ ఆటోల‌ను ఎన్‌టిఆర్ స్టేడియం నుంచి తొల‌గించి కార్మికులు వారి వారి ఇంటి ద‌గ్గ‌ర పెట్టుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు కోరుతున్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png