ఎన్‌టిఆర్ స్టేడియం చుట్టు చెత్తాచెదారం – ప‌ట్టించుకోని అధికారులు

ఎన్‌టిఆర్ స్టేడియం చుట్టు చెత్తాచెదారం ప‌ట్టించుకోని అధికారులు హైదరాబాద్, జూన్ 17, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ డివిజ‌న్ ఎన్‌టిఆర్ స్టేడియం, భీమా మైదానం ప‌రిస‌రాల్లో చెత్తాచెదారంతో నిండిపోయింది. దానికితోడు భీమా మైదానంలో నివ‌సించే పారిశుద్ధ్య కార్మికుల‌కు చెందిన చెత్త సేక‌ర‌ణ వాహ‌నాలు, చెత్త‌, దుర్వాస‌న‌తో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గుర‌వుతున్నారు. భీమా మైదానంలో నివ‌సించే పారిశుద్ధ్య కార్మికుల‌కు చెందిన చెత్త సేక‌ర‌ణ వాహ‌నాల‌ను ఎన్‌టిఆర్ స్టేడియంలో పెట్ట‌డం వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఆటోలను బ‌స్తీ ఎదురుగా, స్కూల్ ఎదురుగా పెట్టడంతో...