స్కూల్ యూనిఫాంల పై పిల్ల‌ల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రించండి – అధికారుల‌ను ఆదేశించిన‌ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్ బ్యూరో, న‌వంబ‌ర్ 4, ( అద్దం న్యూస్ ) :     విద్యార్థుల‌కు అందించిన స్కూల్ యూనిఫాంలపై పిల్లల నుంచి అభిప్రాయాలు ( ఫీడ్‌బ్యాక్ ) సేక‌రించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. విద్యార్థుల నుంచి అభిప్రాయాలు ( Feedback ) సేక‌రించడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ మంది విద్యార్థులు కోరుకునే రంగులు, డిజైన్ల‌కు ప్రాధాన్య‌మివ్వ‌చ్చ‌ని చెప్పారు. బుధ‌వారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో వివిధ శాఖ‌ల ప‌రిధిలోని ప్ర‌భుత్వ వ‌స‌తిగృహాలు, రెసిడెన్షియ‌ల్ స్కూళ్లు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు యూనిఫాంలు, కిట్ల...