Addam News
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 12:45 pm Posted by : Addam News

గ్రాడ్యుయేట్ల‌తో ఓట్ల‌ను న‌మోదు చేయించండి – బిఆర్ఎస్ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ఎమ్మెల్సి సుర‌భి వాణిదేవి సూచ‌న‌

హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్‌ 1, ( అద్దం న్యూస్ ) :   ప్ర‌తి ఇంటింటికి వెళ్లి గ్రాడ్యుయేట్ల‌తో ఓట్ల‌ను న‌మోదు చేయించండని బిఆర్ఎస్ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ఎమ్మెల్సి సుర‌భి వాణిదేవి సూచించారు. బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహా ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం కార్య‌క‌ర్త‌ల విస్తృతస్థాయి సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సురభి వాణిదేవి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… గ్రాడ్యుయేట్ అయిన ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ త‌మ త‌మ ఓటును న‌మోదు చేసుకోవాల‌న్నారు. గ‌తంలో త‌న‌కు ఓటు వేసిన గ్రాడ్యుయేట్లు త‌మ ఓట్లు ఉంటాయ‌ని స‌రిపెట్టుకోవ‌ద్ద‌ని, లేటెస్ట్‌గా మ‌రో సారి న‌మోదు చేసుకోవాల‌న్నారు. గులాబి కండువా వేసుకున్న ప్ర‌తి కార్య‌క‌ర్త ఇంట్లో ఉండే గ్రాడ్యుయేట్లు, ఇంటి ప‌క్క‌న ఉండే వారిని గుర్తించి వారితో ఓటును న‌మోదు చేయించాల‌ని సూచించారు. చెబితే స‌రిపోద‌ని, మ‌న బిఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఇంటింటికి వెళ్లి గ్రాడ్యుయేట్ల‌తో ఓట్ల‌ను న‌మోదు చేయిస్తే ప్ర‌జ‌ల్లో బిఆర్ఎస్ పార్టీని ప్ర‌జ‌ల‌కు చేరువు చేసిన వారవుతార‌న్నారు. ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా గ్రాడ్యుయేట్ల‌ను క‌లిసి వివ‌రాలు చెబుతుంటే మ‌నం న‌మోదు చేస్తే ప్ర‌జ‌ల్లో మంచి భావం పెరుగుతుంద‌న్నారు.

ముఠా జైసింహా మాట్లాడుతూ… రాబోయే ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌లైనా, జిహెచ్ఎంసి ఎన్నిక‌లైనా బిఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల గెలుపు కోసం ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌న్నారు. ఈ స‌మావేశంలో మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, మీడియా ఇన్‌చార్జ్ ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌, పెంటారెడ్డి, రేషం మ‌ల్లేష్‌, సిరిగిరి శ్యామ్‌, క‌ల్వ‌గోపి, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, ఆకుల అరుణ్‌, శంక‌ర్ ముదిరాజ్‌, రాకేష్‌, క‌రికె కిర‌ణ్ కుమార్‌, జివై.గిరి, ముచ్చ‌కుర్తి ప‌ద్మ‌, జావెద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ అలీ, మునావ‌ర్ చాంద్‌, శ్రీధ‌ర్ రెడ్డి, అనిల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.