జవహర్‌న‌గ‌ర్ కమ్యూనిటీహాల్ పరిరక్షణకు జిహెచ్ఎంసి సిబ్బంది నియామకం – కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్ ప‌రిర‌క్ష‌ణ‌కు జిహెచ్ఎంసికి చెందిన ఒక సిబ్బందిని నియ‌మించామ‌ని స్థానిక కార్పొరేట‌ర్ పావని విన‌య్ కుమార్ తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆమె జిహెచ్ఎంసి సిబ్బందితో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ మాట్లాడుతూ... జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌లో క‌ళ్యాణ‌మండ‌పం, వ్యాయామశాల‌, ఆట స్థ‌లం ఉన్నాయ‌న్నారు. చీక‌టి ప‌డిన వెంట‌నే కొంత మంది పోకిరీలు ఈ ప్రాంగ‌ణంలో చేరి జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్ వ‌ద్ద అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌న్నారు. మ‌ద్యం సేవించి...