బస్ స్టాండ్‌లు, మెట్రో స్టేషన్‌లు, ఆసుపత్రులు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో జిహెచ్ఎంసి శుభ్రత

హైద‌రాబాద్‌, ( అద్దం న్యూస్ ) :    గ‌త నాలుగు రోజులుగా కొన‌సాగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా జీహెచ్‌ఎంసీ శుక్ర‌వారం 5వ రోజున నగరంలోని వివిధ సర్కిళ్లు, జోన్‌లలో విస్తృతమైన పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టింది. బస్ స్టాండ్‌లు, మెట్రో స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలతో సహా ప్రజా సేవా ప్రదేశాలలో శుభ్రతను మెరుగుపరచడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడటంపై ఈ కార్యక్రమాలు దృష్టి సారించాయి. తార్నాక సర్కిల్-43లో, తార్నాక బస్ స్టాప్, ఆర్టీసీ ఆసుపత్రి బస్ స్టాప్,...