వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డుతుంటే త‌ప్పించుకుంటున్న జిహెచ్ఎంసి, హైడ్రా – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా

వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డుతుంటే త‌ప్పించుకుంటున్న జిహెచ్ఎంసి, హైడ్రా – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 15, అద్దం న్యూస్ :   వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డుతుంటే జిహెచ్ఎంసి, హైడ్రా ఒక‌రి పై మ‌రొక‌రు చూస్తార‌ని త‌ప్పించుకుంటున్నాయ‌ని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజాజీవనం అస్తవ్యస్తమవుతున్నా, లోతట్టు ప్రాంతాలు, హుస్సేన్‌సాగ‌ర్‌, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారని.. నగరమా నరకమా అన్నట్టుందని...