Addam News
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 8:48 am Posted by : Addam News

4 వారాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ

హైద‌రాబాద్ బ్యూరో, న‌వంబ‌ర్ 12, ( అద్దం న్యూస్ ) :

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్‌ఎంసీ ) ఈ నెల 9 నుండి డిసెంబ‌ర్ 12వ తేదీ వరకు అన్ని 30 సర్కిళ్లలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ‘ప్రగతి 50 నగరాల’ ఫ్రేమ్‌వర్క్ యొక్క కీలక పనితీరు సూచికల ( కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ) ఆధారంగా రూపొందించబడింది. ప్రతి వారానికి ఒక థీమ్‌ను కేటాయించి, ప్రతి పనిదినానికి ఒక నిర్దిష్ట కార్యాచరణను ప్రణాళిక చేశారు. 4 వ రోజు కార్యాచరణ గురువారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని 30 సర్కిళ్లలో చెత్త వేయడం, బహిరంగంగా కాల్చడం, డంపింగ్ చేయడం, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌లపై స్పాట్ ఫైన్లు, దుకాణాలు, వ్యాపారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 421 దుకాణాలు, 120 దుకాణాల‌కు పైన్లు విధించారు. ల‌క్ష 29 వేల 600 రూపాయ‌ల జ‌రిమానా విధించారు. 25.65 కిలోల సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌లను స్వాధీనం చేసుకున్నారు.