Addam News
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 11:21 am Posted by : Addam News

ఫుట్‌పాత్ ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన జిహెచ్ఎంసి

బాగ్‌లింగంప‌ల్లి, ( అద్దం న్యూస్ ) :

హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు ప్రాంతాల్లో ఫుట్‌పాత్ ఆక్ర‌మ‌ణ‌ల‌ను జిహెచ్ఎంసి అధికారులు తొల‌గించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని గాంధీన‌గ‌ర్‌, బాగ్‌లింగంప‌ల్లి డివిజ‌న్ల‌ల్లో ఫుట్‌పాత్‌ల పై కొంత మంది వ్యాపారులు అక్ర‌మ నిర్మాణాల‌ను ఏర్పాటు చేశారు. ఈ నేప‌ధ్యంలో జిహెచ్ఎంసి స‌ర్కిల్‌-40, 41 టౌన్‌ప్లానింగ్ ఏసిపి, సూప‌ర్‌వైజ‌ర్ కిష్ట‌య్య‌, సిబ్బంది వంశీ, ప్ర‌వీణ్‌, రాజు, శ్రీనివాస్ త‌దిత‌రులు ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూల్చివేశారు. ఫుట్‌పాత్‌ల‌ను క‌బ్జా చేసి నిర్మాణాల‌ను ఏర్పాటు చేస్తే త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఏసిపి శ్రీనివాస్ తెలిపారు.