కార్పొరేటర్ పావని చొరవతో చెట్ల కొమ్మలను తొలగించిన జిహెచ్ఎంసి సిబ్బంది
హైదరాబాద్, జూన్ 22, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో గత కొన్ని రోజులుగా వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ తీగలు, ఫీడర్ల పై ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను ఎలక్ట్రికల్ సిబ్బంది తొలగించారు. అయితే ఆ తొలగించిన చెట్ల కొమ్మలను అక్కడికక్కడే రోడ్లపైనే కుప్పలుగా వేశారు. దీంతో అవి పేరుకుపోయాయి. దీంతో డివిజన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కార్పొరేటర్...