హరిత, పరిశుభ్ర హైదరాబాద్ నగరం కోసం జీహెచ్ఎంసీ హ్యాపీ స్ట్రీట్స్ కార్యక్రమం

హైదరాబాద్, న‌వంబ‌ర్ 16, అద్దం న్యూస్ :    నగర ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం పరిశుభ్రమైన, హరిత వాతావరణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పలు సంస్థలతో కలిసి సంజీవయ్య చిల్డ్రన్స్ పార్క్ వద్ద హ్యాపీ స్ట్రీట్స్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించింది. “ క్లీన్, గ్రీన్ హైదరాబాద్ ” అనే అంశంతో సాగిన ఈ కార్యక్రమంలో నగర పరిశుభ్రత, చెత్త నిర్వహణ, వ్యర్థాల విభజన, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. భవిష్యత్ పర్యావరణ పరిరక్షకులైన పిల్లల్లో అవగాహన పెంపు పై...