Migraine: మైగ్రేన్‌కు చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం’ టీ!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామందిని వేధించే ప్రధాన సమస్య మైగ్రేన్ (Migraine) లేదా వన్‌సైడ్ హెడేక్. ఈ నొప్పి వచ్చినప్పుడు తక్షణ ఉపశమనం కోసం చాలామంది పెయిన్ కిల్లర్స్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే, మన వంటింట్లో లభించే అల్లం (Ginger) ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అల్లంలో ఉండే 'జింజెరాల్' (Gingerol), 'షోగాల్స్' (Shogaols) అనే క్రియాశీలక సమ్మేళనాలు మైగ్రేన్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి శరీరంలో మంటను, నొప్పిని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను...