Addam News
Newspaper Banner
Date of Publish : 10 July 2025, 3:44 am Posted by : Addam News

విద్యారంగ సమస్యల పరిష్కరానికి సమయం ఇవ్వండి లేదా సచివాలయంలో బైఠాయిస్తాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆప్ బహిరంగ లేఖ – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

విద్యారంగ సమస్యల పరిష్కరానికి సమయం ఇవ్వండి లేదా సచివాలయంలో బైఠాయిస్తాం 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆప్ బహిరంగ లేఖ

– ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

హైదరాబాద్, జులై 9, అద్దం న్యూస్ :    రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కరానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కలవడానికి ఆప్ ప్రతినిధి బృందానికి సమయం ఇవ్వాలని లేదా సచివాలయంలో బైఠాయిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధ‌వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని లాగా రాష్ట్ర విద్యారంగ సమస్యలు అలాగే ఉన్నాయని, విద్య కమిషన్ సిఫార్సులను అమలు చేయకుండా జాప్యం చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ అంతులేకుండా జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం విద్యారంగానికి రెట్టింపు నిధులను ఎందుకు కేటాయించడంలేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఆప్ ప్రతినిధి కలవడానికి సమయం ఇవ్వాలని… లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళలను తీవ్రతరం చేస్తామని డాక్టర్ దిడ్డి సుధాకర్ హెచ్చరించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png