అన్ని దానాల కంటే అన్నదానం మిన్న
కాచిగూడ, సెప్టెంబర్ 20, ( అద్దం న్యూస్ ) : దానాలన్నింటిలోకెల్లా అన్నదానం ఎంతో విశిష్టమైనదని న్యూ ఇందిరానగర్ శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా ఆదివారం గోల్నాక ఖర్కానా లైన్స్‌లో అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ... విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు వినోద్ కుమార్ చారి, పాక స్వామి, నవీన్, ప్రవీణ్, నరేష్, సాయి,...