Goa: గోవాలో ఘోర అగ్నిప్రమాదం..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ : ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న ‘బర్చ్‌ బై రోమియో లేన్‌’ నైట్‌ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సిలిండర్‌ పేలి 23 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు వరకు పర్యటకులు ఉన్నట్లు సీఎం ప్రమోద్‌ కుమార్‌ సావంత్‌ తెలిపారు. మిగతావారంతా క్లబ్‌ సిబ్బందిగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు, వారంతా కిచెన్‌ సిబ్బంది అని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు సజీవదహనమవగా, 20 మంది ఊపిరాడక చనిపోయారని...