Lionel Messi: 70 అడుగుల మెస్సి విగ్రహం ఆవిష్కరణ

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి (Lionel Messi) భారతదేశ పర్యటన ‘గోట్‌ (GOAT) టూర్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రారంభమైంది. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మెస్సి శనివారం తెల్లవారుజామున కోల్‌కతా నగరానికి చేరుకున్నారు. అభిమానుల కోలాహలం మెస్సితో పాటు ఆయన ఇంటర్ మియామీ సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ కూడా భారత్‌కు వచ్చారు. విమానాశ్రయం వద్ద మెస్సిని చూసేందుకు వందలాది మంది అభిమానులు అర్జెంటీనా జెండాలు చేతబూని, 'మెస్సి.. మెస్సి' అంటూ...