వివేక్నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మీ దేవిగా అమ్మవారి అలంకరణ
గాంధీనగర్, ( అద్దం న్యూస్ ) : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో నెలకొల్పిన అమ్మవారిని శుక్రవారం శ్రీ మహాలక్ష్మీ దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా మహానివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, సహస్రనామార్చన, పారాయణం, ఆరగింపు, తీర్థ ప్రసాద వితరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి పి.కొమ్మాలు, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ జానకి సుధాకర్, ఆలయ...