Addam News
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 2:28 am Posted by : Addam News

శ్రీ మంగళ గౌరీ దేవీ అలంకరణలో శ్రీ కనకాల కట్ట మైసమ్మ అమ్మవారు

క‌వాడిగూడ‌, అక్టోబర్ 13, ( అద్దం న్యూస్ ) :

ద‌స‌రా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ లోయ‌ర్ ట్యాంక్‌బండ్‌లోని శ్రీ క‌న‌కాల క‌ట్ట‌మైస‌మ్మ దేవాల‌యంలో అమ్మ‌వారిని మంగ‌ళ‌వారం శ్రీ మంగ‌ళ గౌరీ దేవి రూపంలో అలంక‌రించారు. శ్రీ పంచామృతాభిషేకం, ఖ‌డ్గ‌మాలార్చ‌న‌, బాల‌భోగం, క‌ల‌శ‌స్థాప‌న‌, శ్రీ ల‌లితా స‌హ‌స్ర‌నామార్చాన‌, చంఢీ హోమం, మ‌హానివేద‌న మంత్ర‌పుష్ప‌ము, ప్ర‌త్యేక అలంక‌ర‌ణ ఉభ‌య‌దాత‌ల పూజ‌లు, హార‌తి మంత్ర పుష్ప‌ము ద్వార‌బంధ‌న‌ము త‌దిత‌ర పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్ గోల్కొండ గౌత‌మ్ కుమార్, ఆల‌య కార్య‌నిర్వాహ‌ణాధికారి మ‌హేంద‌ర్ గౌడ్‌, ఆల‌య అర్చ‌కులు సాత్విక్ శ‌ర్మ, భ‌క్తులు పాల్గొన్నారు.

శ్రీ మంగళ గౌరీ దేవీ అలంకరణలో శ్రీ కనకాల కట్ట మైసమ్మ అమ్మవారు