చిక్కడపల్లి, అక్టోబర్ 11, ( అద్దం న్యూస్ ) :
దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్లింగంపల్లి డివిజన్ చిక్కడపల్లిలో నేతాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 29 వ సంవత్సరం ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో ఘనంగా పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ మాజీ కార్పొరేటర్ పలుస బాల్రాజ్ గౌడ్, కందూరి కృష్ణ, వందన రాజగోపాల్, నర్సింగ్ రావు, పాశం లక్ష్మణరావు, డి.చంద్రమోహన్ గౌడ్, పి. శివకృష్ణ, వీణా దేవి, అన్నపూర్ణ తదితరులు అమ్మవారికి పూజలు చేశారు. అర్చకులు పులిగడ్డ హనుమంతరావు, నాగరాజు శర్మ, సాయినాథ్ శర్మ ల వేద మంత్రాలతో అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ![]()