నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ప్రారంభ‌మైన అమ్మ‌వారి పూజ‌లు

చిక్క‌డ‌ప‌ల్లి, అక్టోబర్ 11, ( అద్దం న్యూస్ ) : దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంప‌ల్లి డివిజన్ చిక్కడపల్లిలో నేతాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 29 వ సంవత్సరం ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో ఘనంగా పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్‌ గౌడ్, కందూరి కృష్ణ, వందన రాజగోపాల్, నర్సింగ్ రావు, పాశం లక్ష్మణరావు, డి.చంద్రమోహన్ గౌడ్, పి. శివకృష్ణ, వీణా దేవి, అన్నపూర్ణ తదితరులు అమ్మవారికి పూజలు చేశారు....