Gold Prices: 2025 చివరి ప్రియులకు ఊరట: భారీగా తగ్గిన వెండి ధరలు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఈ ఏడాది 2025 సంవత్సరం ముగింపు వేళ బులియన్ మార్కెట్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏడాది పొడవునా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం (Gold Prices), వెండి ధరలు డిసెంబర్ 31న తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు (Profit Booking) దిగడంతో వెండి ధరల్లో భారీ పతనం నమోదైంది. ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో వెండి (Silver Prices) ఫ్యూచర్స్ ఏకంగా 4.63 శాతం తగ్గి కిలో రూ.2,39,395 వద్ద ట్రేడవుతుండగా, బంగారం (Gold Prices) ఫ్యూచర్స్...