Addam News
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 9:06 am Posted by : Addam News

Gold Rate: ఇలా అయితే కష్టమే.. తులం గోల్డ్ ఎంతంటే?

Gold Rate: ఇలా అయితే కష్టమే.. తులం గోల్డ్ ఎంతంటే?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: పసిడి ప్రియులకు మళ్లీ వరుస షాకులు తగులుతున్నాయి. గోల్డ్ రేట్లు మరోసారి రికార్డ్ గరిష్టాల దిశగా పరుగులు తీస్తున్నాయి. వరుసగా రెండు రోజులు ధర భారీగా పెరగడం విశేషం. ఇంకా వెండి ధర.. బంగారాన్ని మించి పరుగులు పెట్టింది. దేశీయంగా ఇప్పటికే గోల్డ్, సిల్వర్ రేట్లు ఎగబాకాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పుత్తడి ధర ఇవాళ రూ. 550 పెరగడంతో ప్రస్తుతం తులం రూ. 1,27,250 కి చేరింది. దీనికి ముందటి రోజు రికార్డు స్థాయిలో రూ. 2200 పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా రూ. 600 ఎగబాకడంతో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,38,820 వద్ద ఉంది. ఇక్కడ కిందటి రోజు రూ. 2400 పెరిగింది. బంగారం ధరల బాటలోనే వెండి రేటు కూడా పెరుగుతూనే ఉంది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో సిల్వర్ రేటు రూ. 6 వేలు పెరిగి కేజీకి ప్రస్తుతం రూ. 2.71 లక్షలకు ఎగబాకింది. దీనికి ముందటి రోజు రూ. 8 వేలు పెరిగింది. ఇలా 2 రోజుల వ్యవధిలో రూ. 14 వేలు పెరగడం గమనార్హం. గతేడాది ఆఖర్లో 3 రోజుల్లో మాత్రం రూ. 28 వేలు తగ్గుముఖం పట్టింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png