Addam News
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 6:49 am Posted by : Addam News

Gold: దేశ జీడీపీ కన్నా ఇళ్లలో దాచుకున్న బంగారం ఎక్కువ!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారతీయులకు బంగారం (Gold) అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్. ఈ మక్కువే ఇప్పుడు ఒక అరుదైన గణాంకానికి దారితీసింది. తాజా నివేదికల ప్రకారం, భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం మొత్తం విలువ దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (GDP) కంటే ఎక్కువగా ఉందని తేలింది.

మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) అంచనాల ప్రకారం, భారతీయ ఇళ్లలో దాదాపు 34,600 టన్నుల బంగారం నిల్వ ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో (ఔన్సుకు $4,500 పైన), ఈ (Gold) నిల్వల విలువ ఏకంగా 5 లక్షల కోట్ల డాలర్లను దాటింది. కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) ప్రకారం భారత ప్రస్తుత జీడీపీ సుమారు 4.1 లక్షల కోట్ల డాలర్లు మాత్రమే. అంటే దేశం ఏడాదిలో ఉత్పత్తి చేసే ఆదాయం కంటే, ప్రజల బీరువాల్లో మూలుగుతున్న పసిడి విలువే ఎక్కువన్నమాట.

ఇదిలా ఉండగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా తన బంగారం (Gold) నిల్వలను పెంచుకుంటోంది. 2024 నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ సుమారు 75 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడంతో, మొత్తం నిల్వలు 880 టన్నులకు చేరాయి. ఆర్థిక అనిశ్చితి సమయాల్లో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా, భారతీయుల పసిడి ప్రేమ దేశ ఆర్థిక వ్యవస్థనే సవాలు చేసే స్థాయికి చేరడం విశేషం.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png