Gold: దేశ జీడీపీ కన్నా ఇళ్లలో దాచుకున్న బంగారం ఎక్కువ!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారతీయులకు బంగారం (Gold) అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్. ఈ మక్కువే ఇప్పుడు ఒక అరుదైన గణాంకానికి దారితీసింది. తాజా నివేదికల ప్రకారం, భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం మొత్తం విలువ దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (GDP) కంటే ఎక్కువగా ఉందని తేలింది. మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) అంచనాల ప్రకారం, భారతీయ ఇళ్లలో దాదాపు 34,600 టన్నుల బంగారం నిల్వ ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో...