Addam News
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 11:19 pm Posted by : Addam News

SIR ప్రక్రియను కొనసాగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం

SIR ప్రక్రియను కొనసాగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం
– బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

హైద‌రాబాద్‌, జూన్ 26, ( అద్దం న్యూస్ ) :   భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా ప్రక్షాళన, తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ( SIR ) ప్రక్రియను కొనసాగించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. బిఎల్ఓల‌కు ఎన్యుమరేషన్ ఫారంలను ఇవ్వాల‌ని శుక్రవారం జిహెచ్ఎంసి సర్కిల్–41 కార్యాలయంలో ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ( ERO ) ప్రవీణ్ రెడ్డిని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సంద‌ర్భంగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ మాట్లాడుతూ… ముషీరాబాద్ నియోజకవర్గంలో SIR ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభ‌మై 48 గంటలు కావొస్తున్నా… ఇంత వరకు గాంధీనగర్ డివిజన్‌లోని 46 పోలింగ్ బూత్‌ల‌కు గానీ, బూత్ స్థాయి అధికారులు ( BLO ) లకు ఎన్యుమరేషన్ ఫారంలు అధికారులు అందించలేదన్నారు. కేటాయించిన నిర్ణీత సమయంలో సిబ్బంది ఓటర్లను కలిసి ఇంటింటికీ తిరిగి ప్రక్షాళన కార్యక్రమం ఎలా పూర్తి చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నంలో భారత ఎన్నికల సంఘానికి సహకరించడంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png