స‌ర‌స్వ‌తీ పుష్క‌రాల్లో కనీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైద‌రాబాద్‌, మే 26, అద్దం న్యూస్ :   ప్రభుత్వం కాలేశ్వరం సరస్వతీ నది పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఆడంబరాలకు పోయి, పుష్కరాలకు వచ్చిన ప్రజల్ని పట్టించుకున్న పాపనపోలేదని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. సోమ‌వారం దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... పుష్కరాలకు విచ్చేసిన భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా టెంకాయకు వంద రూపాయలు, దర్శనానికి వంద రూపాయల చొప్పున వసూలు చేసే పరిస్థితికి తయారై ప్రజలను ఇక్కట్లు పాలు చేసిందన్నారు. పోలీస్...